kiran24x7news:
పత్తికొండ నియోజకవర్గం అసెంబ్లీకీ ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుంచి పోటీ చేస్తున్న టి రామచంద్రయ్య నామినేషన్ కార్యక్రమానికి కోడుమూరు సిపిఐ పార్టీ తోపాటు ఏఐటియుసి, హమలి వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్,వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజాసంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. పత్తికొండ సిపిఐ పార్టీ అభ్యర్థి రామచంద్రయ్య సోమవారం పత్తికొండలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.రామచంద్రయ్యకు మద్దతుగా సిపిఐ నాయకులు రాజు ఆధ్వర్యంలో సుమారు వందమంది సిపిఐ పార్టీ శ్రేణులు మూడు వాహనాల్లో నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో మద్దూరురాముడు,సులోచనమ్మ,నాగలక్ష్మమ్మ,రాముడు,లక్ష్మి దేవి,వర్కురు రాముడు,చిన్న బజారి, అంజి,రమేష్,ఆంజనేయలు,గడ్డం నాగరాజు, సాగర్,పెద్దయ్య,మద్దిలేటి, డ్రైవర్ మాదవస్వామి, రైతు సంఘము రాజు, పోగుల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.






