kiran24×7news ;
సిపిఐ ,,సిపిఎం పార్టీలు, బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ,మురళీకృష్ణ, కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ గారి ,హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ,సిపిఐ ,,సిపిఎం నాయకులు బి కృష్ణ,,గఫూర్మియా ,బి రాజులు తెలిపారు.
కోడుమూరు పట్టణంలో, కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి పి మురళీకృష్ణ గారు, సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు .ఆయన మాట్లాడుతూ ,,తనకు ఎంపీ అభ్యర్థికి, సహకరించి ఓటు వేసి గెలిపించేందుకు ,వామపక్ష నాయకులు కృషి చేయాలని వారిని కోరారు.. సమావేశానంతరం వారు కోడుమూరు పట్టణంలో ,ఒకటవ వార్డు నుండి ,మోదిన్ పేట ,గొల్ల గిరి ,పెద్దబాయగిరి ,తదితర పట్టణ వీధులలో ప్రచార కార్యక్రమం చేపట్టారు ..కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి మురళీకృష్ణ మాట్లాడుతూ, వామపక్ష పార్టీలు తనను బలపరుస్తున్నారని ,తాను గతంలో ఎమ్మెల్యేగా గెలిచి కోడుమూరు కు అభివృద్ధి పనులు చేశానని, ఈసారి గెలిపిస్తే తాను తప్పకుండా, కోడుమూరులో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తానని, అలాగే త్రాగునీటి సమస్య కూడా పరిష్కరిస్తానని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాధవస్వామి ,ఎం చిన్న రాముడు ,ఆటో మధు ,ఆటో చిన్న, అక్బర్ బాషా ,సిపిఎం నాయకులు వీరన్న ,చేనేత లక్ష్మన్న, ఈ న్యూస్ భాష ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్దాం హుస్సేన్, మోషన్న, శ్రీరాములు ,లక్ష్మిరెడ్డి ,వెంకటగిరి శివ వీరితోపాటు మహిళా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు..






