kiran24×7news ;

గూడూరు మండలం ఆర్. ఖానాపురం గ్రామంలో శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు .. కార్యక్రమంలో కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు గూడూరు మండల జడ్పిటిసి మౌలాలి గూడూరు మండలం మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు వైసిపి నాయకులు ప్రతాపరెడ్డి మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు..

ప్రచారానికి విచ్చేసిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు.. జగనన్న అందించిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో చిన్నపిల్లల నుండి ముసలిదాకా అందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు.. అలాగే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలో మౌళికవసతుకు ఏర్పాటు చేసి వైద్యాన్ని , విద్యని పల్లెలకు చేరువ చేసారని గుర్తు చేశారు.. కుల,మత,వర్గ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించటంలో సఫలమై నేడు ఓట్లు అడగడానికి వచ్చామని అన్నారు.. జగనన్న సహకారంతో కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.