kiran24×7news ;

కర్నూలు మండలం పసుపుల, సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు, మణిగాంధీ గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారు..

ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన నాయకులకు పూలమాలలు వేసి, డప్పు చప్పుళ్లతో, బాణసంచాలు కాల్చి గ్రామంలోకి ఘనస్వాగతం తెలిపారు..

నాయకులు గ్రామంలోని ఇంటింటికి వెళ్తూ జగనన్న చేసిన సంక్షేమ పథకాల గూర్చి చెప్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.

ఈ సందర్భంగా కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని అందరికీ జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయని రానున్నది కూడా జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు..