kiran24×7news ;
ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు షోకు ప్రజలు అభిమానులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని బస్టాండ్ కు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోకు వేలాదిగా టిడిపి పార్టీ శ్రేణులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిన కోడుమూరు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవ చేశారు.

నియోజకవర్గంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్న వైకాపా నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని వైసిపి పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమకు అఖండ విజయం అందించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.

రాష్ట్ర అభివృద్ధి టిడిపి పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అఖండం మెజార్టీని అందించాలని ఓటర్లను ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ఈసారి కోడుమూరు నియోజకవర్గం లో అఖండ విజయం సాధించి చరిత్ర తిరగరాస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గూడూరు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు తెలుగు శీను రేమట వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు సుందరరాజు సృజన్ పౌలు కౌన్సిలర్లు బుడంకాలి  నాయకులు కూరగాయల చాంద్ నాగప్ప యాదవ్ మన్నన్ భాష పెంచగల పాడు కృష్ణ కే నాగలాపురం సురేష్ మరియు కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు బెలగల్ కర్నూలు రూరల్ మండలంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు నేతలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.