kiran24×7news ;
కోడుమూరు మండలం వర్కూర్ గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి, ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా వర్కుర్ గ్రామంనకు విచ్చేసిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని ఘనస్వాగతం పలికిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ది చేకూరిందని, కులాలు, మతాలు చూడకుండా ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అర్హులైన లబ్దిదారులకు ఇంటి గడప వద్దకే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందించి వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు అండగా ఉన్నామన్నారు.. కానీ చంద్రబాబు, కూటమి నాయకులు ఇంటివద్దకి వస్తున్న పెన్షన్లు చూసి ఓర్వలేక, కేసులు వేసి, అడ్డుకున్నారని ప్రజలు గమనించాలని, వారికి డిపాజిట్లు కూడా రాకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని దొంగ మాటలు చెప్పిన ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడని, మళ్ళీ రానున్నది జగన్ గారి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదిగిందని అన్నారు.. నియోజకవర్గంలో పేద వారందరికీ విద్య , వైద్యం అందేలా చూస్తామని అన్నారు.. నియోజకవర్గంలో సాగునీరు, మంచి నీరు, రోడ్లు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.. కోడుమూరు గడ్డ ఎప్పుటికి వైసిపి అడ్డనే అని స్పష్టం చేశారు.. అదే విధంగా డా.ఆదిమూలపు సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలో ఎవరికైనా ఆసుపత్రి విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా అర్థరాత్రైనా తనని సంప్రదించవచ్చని, ప్రతి ఇంటికి తానే డాక్టర్ ని అయి వైద్యాన్ని అందిస్తా అని అన్నారు..
రానున్న మే13వ తేదీన జరగనున్న ఎలక్షన్ లో వైసిపి ఎంపీగా బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే గా డా.ఆది మూలపు సతీష్ గారికి ఓట్ల వేసి గెలిపించి, జగనన్న కు కానుకగా అందించాలని ప్రజలను కోరారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ దస్తగిరి, ఎం. రామకృష్ణారెడ్డి, జె.రఘునాథరెడ్డి, వంశిధర్ రెడ్డి, ఎం.సోమశేఖర్ రెడ్డి, జె.అయ్యపు రెడ్డి, పాపి రెడ్డి, వెంకటరమణ రెడ్డి, ఎం.తోటయ్య, చంద్ర రెడ్డి, బాటకటి పెద్దరంగడు, ఎంపిటిసి కౌలయ్య, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, కొత్తకోట మహబూబ్ బాషా, సి బెళగల్ గోపాల్, భూపాల్ నగర్ వెంకటేష్, ఖాలీల్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..






