kiran24×7news ;
సి.బెళగల్ మండలం బురన్ దొడ్డి, కృష్ణదొడ్డి, గొల్లలదొడ్డి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదిమూలవు సతీష్ గారు..
ఈ సందర్భంగా కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని అన్నారు.. జగనన్న అంటే మన నమ్మకం అని, జగనన్ననే మన భవిష్యత్తు అని పిలుపునిచ్చారు.. గత టిడిపి ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్దిదారులకు ఇంటికే నెరుగా పథకాలు వస్తున్నాయని అన్నారు..
జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో చిన్న, పెద్ద, కులం, మతం తేడా లేకుండా అందరికీ మరింత లబ్ది చేకూరేలా ఉందని అన్నారు.. అలాగే వైద్యం విషయంలో అర్థరాత్రి అయినా తనను కలవవచ్చని, ప్రతి ఇంటికి నేనే డాక్టర్ ను అవుతానని డా.ఆదిమూలపు సతీష్ గారు అన్నారు.. అలాగే విద్య, వైద్యం విషయంలో ఏ అవసరం ఉన్న తన ఫోన్ నెంబర్ కు కాల్ చేయవచ్చని నెంబరును గ్రామస్థులకు ఇచ్చారు.. అలాగే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా జగనన్న నాయకత్వం లో అభివృద్ధి చేస్తానని అన్నారు..
రానున్న మే13 జరిగే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యేగా ఆదిమూలపు సతీష్ గారికి, ఎంపీగా బివై రామయ్య గారికి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో ఎంపిపి మున్నెప్ప, మండల కన్వీనర్ సోమ సెగ్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ తులసి రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు ఎస్ ఎం బాషా, కో అప్షన్ మెంబర్ హారూన్, వ్యవసాయ సహాయ మండలి సభ్యులు పొలకల్ ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి, గుడుపాడు లక్ష్మికాంత రెడ్డి, ఎం.వెంకటేష్, బురన్ దొడ్డి రాజ శేఖర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్ ఆచారి, బాయ్కాటి మద్దిలేటి,సంధ్య విక్రమ్, సోమిరెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోవింద రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, సి బెళగల్ సర్పంచ్ పాండు రంగన్న, ముడుమాల మద్దిలెట్టి, నగేష్, శ్రీనివాసులు, బ్రహ్మనదొడ్డి దస్తగిరి, మారం దొడ్డి రాఘవేంద్ర, అంజి, రామచంద్రారెడ్డి, లక్ష్మన్న, భాను ప్రకాష్ రెడ్డి, హనుమంతు, రఘు, శోభన్ బాబు, హనుమంతుడు, నాగన్న, ఇమాన్యుయల్, నాగప్ప, కొండయ్య, నరసింహుడు, ఎర్రన్న, కొత్తకోట శ్రీను, ప్రభాకర్, మహానంది, రాజేష్, బెళగల్ రఘురెడ్డి, బసయ్య, అరుణ్, గోపాల్, మద్దిలెటి, పొలకల్ సోమప్ప, లోకేష్, రాఘవేంద్ర , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..






