kiran24×7news ;

కర్నూలు పట్టణం స్టాంటన్ పురంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి, ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని కోరిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు, APDIC డైరెక్టర్ పాటిల్ హనుమంత రెడ్డి గారు..

ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో పేదలకు వరంగా మారబోతుందని అన్నారు.. అలాగే జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయని, కులాలకు, మతాలకు తావివ్వకుండా అందరికి మేలు చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో పుట్టిన పిల్లల నుండి పండు ముసలి దాకా అందరికీ ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు.. జగనన్న ప్రభుత్వంలో విద్య, వైద్యం అందరికి చేరువ అయ్యిందని అన్నారు.. డా.ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.. ప్రతి పేదవాడి ఇంటికి తానే డాక్టర్ను అవుతానని మాట ఇచ్చారు.. వైద్యం విషయంలో ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, పేదలకు మెరుగైన చికిత్స అందేలా చూస్తానన్నారు..

కోడుమూరు నియోజకవర్గం – వైసిపి పార్టీకి అడ్డ అని, కోడుమూరు లో మళ్ళీ వైసిపి పార్టీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు..

రానున్న మే13న జరిగే ఎలక్షన్ లో ప్రజలంతా రెండు ఓట్లు వైసిపి పార్టీకి వేసి జగన్ గారు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రంసింహా రెడ్డి, సాంబశివరావు, నాయకులు హనుమంత్ రెడ్డి, సూరేష్, ప్రభుదాస్, ప్రసాద్ గౌడ్, రాజగౌడ్, రమణ, మోజెస్, ప్రశాంత్, అబ్బాస్, సుందర్ రాజు, రాము, ఇషాద్, యూత్ వింగ్ జిల్లా కార్యదర్శి గిరి ప్రసాద్, వీరభద్ర రెడ్డి, దామోదర్ నాయుడు, ఇస్సాకు, మౌలాలి, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు..