kiran24×7news ;

కర్నూల్ మండలం మామిదాలపాడు, మునగాలపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ గారు, వైయస్సార్ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పబోడని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాడని తెలిపారు.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ గారిది అని అన్నారు.. జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా పేద ప్రజలకి మరింతగా మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.. కోడుమూరు నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్తామని అన్నారు.. చంద్రబాబు మాటలను ఎవరు నమ్మద్దని, గతంలో కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని అన్నారు.. రానున్నది మళ్ళి జగన్ గారి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.. కోడుమూరు ఎప్పటికీ వైసీపీ అడ్డ అని అన్నారు..

రానున మే13న జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని గెలిపించి, జగన్ గారికి కానుకగా అందించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో కర్నూల్ జెడ్పిటిసి ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ నెహమియా, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, గూడూరు జడ్పిటిసి మౌలాలి, ఎం ఉదయ్, ఎం భార్గవ్ హనుమంతు రెడ్డి, బోయ వెంకటేష్, సురేష్, సురేంద్ర గౌడ్, రంగన్న, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్రన్న, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ప్రసాదు, మల్లికార్జున, మురళీకృష్ణ, చైతన్య, అహ్మద్ ఆలీ, సుబకర్, లక్ష్మన్న, బోయ శీను, దామోదర్ నాయుడు, మౌలాలి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..