kiran24×7news ;
గూడూరు నగర పంచాయతీలోని కోటవీధి కుమ్మరి వీధి మాల వీధి నందు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం జరిగింది..
ఎన్నికల ప్రచార కార్యక్రమం లోచైర్మన్ జలుపాల వెంకటేశ్వర్లు గారు వైస్ చైర్మన్ PN అస్లాం గారు రెండవ వైస్ చైర్మన్ గోనెగండ్ల లక్ష్మణ్ గారు మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు గారు మరియు స్థానిక కౌన్సిలర్లు నేతలు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతీ ఒక్క కుటుంబం లబ్ది పొందిదని, సంక్షేమ పథకాలు అర్హులైన అందరికి అందాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు, పట్టణాలు శరవేగంతో అభివృద్ధి చెందాయని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు..


గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్ గారిది అని అన్నారు.. జగనన్న చేసేది మాత్రమే చెప్పుతాడని, చెప్పింది 100% చేస్తాడని అన్నారు.. మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో లోని అన్ని పథకాలను తప్పక నెరవేర్చి, పేదవాళ్లకు అండగా ఉంటాడని అన్నారు.. చంద్రబాబు లాగా దొంగ హామీలు ఇచ్చి, ప్రజలని మోసం చేయమని అన్నారు.. చంద్రబాబు చేసిన కుట్రల వల్ల నేడు అవ్వ , తాతలు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కాబట్టి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు కు తగిన గుణపాఠం ఓటు రూపంలో చెప్పాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలోకౌన్సిలర్లు ,కుమార్ ,మద్దిలేటి నందకిషోర్ ,ఖలీల్, టీచర్ కిషోర్,దస్తగిరి ,బజారి పట్టణ కన్వీనర్ ఆబేలు, కో ఆప్షన్ నెంబర్ మాదర్ వైసిపి నాయకులు ప్రవీణ్ , ప్రతాప్, దండు శీను, ప్రభాకర్ ,పైగిరి మధు, షేక్ష వలి, క్రాంతి ,మల్లికార్జున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది..






