kiran24×7news ;
కోడుమూరు పట్టణంలోని చిన్న బోయ వీధిలో ఆకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలి ఇంటిలో ఉన్న రవి అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి.
రెండు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పెళ్లి పెద్ద శబ్దం రావడంతో పేలుడు శబ్దానికి చుట్టూ ప్రక్కల ఇళ్లవారు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. వెంటనే ఇంటి వద్దకు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఇంటి యజమాని రవి మాత్రమే ఉంది భార్యా పిల్లలు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇల్లు తీవ్ర ప్రమాదానికి గురై నష్టం వాటిల్లింది. సకాలంలో అక్కడికి వచ్చి వచ్చిన కాలనీ ప్రజలు ప్రమాదం కు గురైన ఇంటి నుండి రవీని బయటకు తీసుకువచ్చి అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని రవి భార్య సుజాత, పిల్లలు ఊరికి వెళ్ళటం తో రవి మాత్రమే ప్రమాదం కు గురి కావటం జరిగింది.






