కిరణ్ 24×7 న్యూస్;
ఫోటో .. కేక్ కట్ చేస్తున్న టిడిపి నాయకులు.
గూడూరు నగర పంచాయతీ నందు సోమవారం సినీ నటుడు మరియు ఎమ్మెల్యే అయిన నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.. పుట్టినరోజు వేడుక సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో మాజీ నగర పంచాయతీ వైస్ చైర్మన్ కే. రామాంజనేయులు టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు జిల్లా నాయకులు సుందర్ రాజు టిడిపి నాయకులు నాగప్ప యాదవ్ మన్నన్ భాష చందు చిలక శీను ఈసాక్ ఇబ్రహీం ఆర్టీవో కృష్ణ యూసుఫ్ తదితరులు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.






