కిరణ్24×7 న్యూస్’:  గూడూరు పట్టణంలో మంగళవారం రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో గంగమ్మవ్వ 15వ సంవత్సర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రజక సంఘం నాయకులు అశోక్ ఆధ్వర్యంలో చేపట్టారు.పట్టణంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా కుమ్మరి కుంటలు వెలసిన శ్రీ గంగమ్మవ్వ గుడి వరకు తరలి వెళ్లారు.ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు లక్ష్మన్న,శేషన్న, సురేష్, అశోక్, రమేష్, గోవిందు, రాజు, లింగన్న, ఎర్రన్న, నాగరాజు, రాజు, రామదాసు, శామన్న, పెద్ద ఎర్రన్న, మరియు సంఘం పెద్దలు పాల్గొన్నారు.