గూడూరు, జూన్ 14,( కిరణ్24×7న్యూస్)
బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని గూడూరు ఎస్సై హనుమంతయ్య హెచ్చరించారు . శుక్రవారం గూడూరు పట్టణంలో జరిగే వారపు సంతను ఎస్సై హనుమంతయ్య మరియు సిబ్బంది కలిసి మార్కెట్లో పర్యటించారు. పశువులను విక్రయించే వ్యాపారులకు కొనుగోలు చేసే వారికి బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను విక్రయించరాదని అలా విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని రహదారికి నలువైపులా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గోవులను అక్రమంగా తరలించకుండా పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు. సంత మార్కెట్ నిర్వాహకులకు మరియు పశువులు అమ్మే వ్యాపారస్తులకు, దళాలీలకు నోటీసులు అందజేశారు.






