కిరణ్ 24×7 న్యూస్; జూన్18,గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జిల్లా మలేరియా అధికారి డిఎంఓ నూకరాజు మలేరియా, దేంగు, మెదడు వాపువ్యాధి జ్వరాలు రాకుండా మరియు దోమల నివారణ కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత శుభ్రత తో పాటు పరిసరాల శుభ్రత పై కూడా దృష్టి సాగించాలని తెలిపారు. నీరు నిలువ వుండే ప్రదేశాలు, కాలువలు ఇంటిలో నీరు నిల్వ చేసుకునే నీటి ట్యాంక్ లలో దోమలు పెరగకుండ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్యం వచ్చిన వెంటనే తీసుకోవలసిన వైద్య సేవలపై అధికారులకు ఆరోగ్యాసిబ్బంది వివరించారు.ఈ కార్యక్రమం లో గూడూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ జులపాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ దివాకర్ రెడ్డి, మలేరియా అధికారి నూకరాజు , వైద్యురాలు షఫీయా,ఏ ఈ,హెచ్ఈ కృష్ణరెడ్డి, రామకృష్ణ సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






