కిరణ్24×7న్యూస్,గూడూరు( జూన్, 27)..గూడూరు పట్టణంలోని కోటవీధిలో గత 15 రోజులుగా నెలకొన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపినట్లుగా గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రం కావడంతో కాలనీ ప్రజలు సమస్యను పరిష్కరించాలని చైర్మన్ మరియు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో వారు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కారం పై దృష్టి సాగించారు. విద్యుత్ మోటార్లను మరమ్మతు చేయించి సంపు ద్వారా నీటిని కాలనీకి మళ్లించినట్లుగా తెలిపారు. ఇకపై కాలనీలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు గూడూరు పట్టణంలోని పలు కాలనీలలో దోమల నివారణకై కాలువలలో స్ప్రే చేయించడంతోపాటు సీజనల్ వ్యాధులు వాపించకుండా పారిశుద్ధ పరులను ముమ్మరం చేయించినట్లుగా గూడూరు నగర పంచాయతీ చైర్మన్ తెలిపారు.






