కిరణ్24×7న్యూస్,( జూలై, 1) గూడూరు మండలం లోని కే నాగలాపురం, గుడిపాడు, జూలకల్ గ్రామాలలో సోమవారం మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ. సునీల్ కన్నా, ఎంపిడిఓ వి. విజయ సింహా రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వం నూతనంగా పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటిబద్దకే వెళ్లి అధికారులు, సచివాలయం సిబ్బంది ప్రజాప్రతినిధుల సమక్షంలో వారికి పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టిడిపి నేతలు, మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.