కిరణ్24×7న్యూస్,1/7/2024.,గూడూరు నగర పంచాయతీ పరిధిలోని సింగనగేరి 7వ వార్డులో సోమవారం 7వ వార్డు కౌన్సిలర్ రత్నమ్మ, కో ఆప్షన్ సభ్యులు పుట్టపాశం రామాంజనేయులు, తెలుగుదేశం నాయకులు పుట్టపాశం చెన్నప్ప, రంగన్న, పుట్టపాశం పరుశురాములు, మాజీ చైర్మన్ ఎస్ ఈ భాస్కర్,కొండన్న, చేతుల మీదుగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వృద్ధులకు పెన్షన్లు పెంచినట్లుగా మొదటి సంతకం చేసి తన మాటను నిలుపుకున్నారని తెలిపారు. కాలనీలోని లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి కౌన్సిలర్ మరియు కోఆప్షన్ సభ్యులు నాయకుల చేతులమీదుగా అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, మరియు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కోఆప్షన్ సభ్యులు రామాంజనేయులు కౌన్సిలర్ రత్నమ్మ మరియు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.






