కిరణ్24×7న్యూస్,( జూలై, 1)
గూడూరు పట్టణంలోని వైద్య కేంద్రంలో సోమవారం డయేరియా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమంను వైద్యాధికారి ప్రత్యూష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నెలల పాటు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎంఎల్ హెచ్పీలు ఇంటింటికి వెళ్లి డయేరియా గురించి వివరించి ఎలా నివారించాలో అవగాహన కల్పించాలని తెలిపారు. డయేరియా సోకిన వారికి వెంటనే తీసుకోవాల్సిన వైద్య సేవలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయాలని అన్నారు. నీటిని వడబోసి త్రాగడం ఇంటి మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడం వేడి ఆహారపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం వంటి విషయాలను వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అర్ఫాన్ భాష, హెచ్ ఈ కృష్ణా రెడ్డి, రాఘవయ్య సిబ్బంది పాల్గొన్నారు.






