కిరణ్24×7న్యూస్, (జులై, 1).. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో సోమవారం పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. మొదటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పూలమాలవేసి పాలతో అభిషేకించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మద్దిలేటి టిడిపి సీనియర్ నాయకుడు చిన్న గిడ్డయ్య. కృష్ణ నాగేష . అలీ భాష పత్తి రవి. చంద్రశేఖర్ రవి. శివ గిడ్డయ్య. గోపాల్. తిప్పన. యుగంధర్. సీనరీ.పాల్గొన్నారు.






