కిరణ్24×7న్యూస్,(2,జూలై) గూడూరు నగర పంచాయతీలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ముందు భాగంలో చైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రార్థన వేదిక షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. చైతన్య యూత్ స్థాపించి 35 సంవత్సరములు పూర్తికా వస్తున్న సందర్భంగా యూత్ అధ్యక్షులు ఎల్. వెంకటేశ్వర్లు మరియు సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ప్రార్ధన వేదిక షెడ్డు ఏర్పాటను చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ షెడ్డు నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావస్తోందని జులై నెలలో పూర్తిచేసి పాఠశాలకు అప్పగిస్తామని తెలిపారు. చైతన్య యూత్ జ్ఞాపకార్థం ఒక లక్ష 60 వేల రూపాయల వ్యయంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తమవంతుగా చైతన్య యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు .