కిరణ్24×7న్యూస్,గూడూరు (జులై,6)
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరు పట్టణంలోని పశు వైద్య కేంద్రంలో ఏడి శివకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పెంపుడు కుక్కలకు మరియు కుక్క పిల్లలకు ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల ను వేసే కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన కుక్కలకు ఏడి శివకుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ యజమానులు తమ పెంపుడు కుక్కలకు సరైన సమయంలో వ్యాధి పరీక్షలు నిర్వహించి, సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలను అందించాలన్నారు. పెంపుడు జంతువులకు ఏవైనా వ్యాధులు,అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వెంటనే పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ధనుంజయ ఆచారి, వనిత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.