కిరణ్24×7న్యూస్,(జులై,6), గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. శనివారం కమిషనర్ దివాకర్ రెడ్డి, ఏఈ నరసింహులు శానిటేషన్ సిబ్బందితో కలిసి గూడూరు నగరపంచయితి పరిధిలోని కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చేందుకు గాను నగర పంచాయతీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కాలనీలలోని ప్రజలు ఏవైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ ఇన్చార్జి హెల్త్ అసిస్టెంట్ రవి కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతిరోజు వేడి చేసి త్రాగునీటిని సేవించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,పరిసరాల్లో నీటి నిల్వలు, పిచ్చిముక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.