కిరణ్24×7న్యూస్: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని ఏబీఎన్ చర్చి చర్చి నందు గూడూరు పట్టణానికి చెందిన బోజుగు సుభాకర్ కుమారుడు ప్రేమ్ కుమార్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి కోట్ల హరి చక్రపాణి రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ , రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దండు వీరయ్య, ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.నూతన దంపతులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరుకు చేరుకున్న కోడుమూరు ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ముఖ్య అతిథులను స్థానిక నేతలు వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ చైర్మన్ జె.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ లు అస్లాం భాష, లక్ష్మన్న, గూడూరు మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు, కర్నూలు మండల జడ్పిటిసి ప్రసన్నకుమార్, పట్టణ కన్వీనర్ ఆబెల్, కౌన్సిలర్ మద్దిలేటి, నాయకులు పోలకల్ ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, మధు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






