కిరణ్ 24×7 న్యూస్: గూడూరు నగర పంచాయతీలో నిర్వహిస్తున్న శ్రీ మణికంఠ వైన్ షాప్ ను తొలగించాలని వైన్ షాప్ సమీపంలో గల వ్యాపారులు కలెక్టరేట్ కార్యాలయంలోని ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశాల మేరకు మంగళవారం మద్య నియంత్రణ శాఖ సిఐ మంజుల గూడూరు పట్టణంలోని శ్రీ మణికంఠ వైన్ షాపును పరిశీలించారు. స్థానిక వ్యాపారులతో సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ వైన్ షాప్ నిర్వహణ వల్ల చుట్టుపక్కల గృహాలలో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు మరియు పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు ఇబ్బంది వాటిల్లుతుందని, తమ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి ప్రదేశంలో శ్రీ మణికంఠ వైన్ షాప్ నిర్వహించడం మంచిది కాదని కావున వైన్ షాప్ ను ఇక్కడి నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు.మద్య నియంత్రణ శాఖ సీఐ మంజుల మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్ మరియు డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కు నివేదికను తెలియజేస్తానని వారి ఆదేశానుసారం తగు చర్యలు తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ అస్లాం, కౌన్సిలర్లు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు..






