
కిరణ్ల్ 24×7 న్యూస్: శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య హెచ్చరించారు. ఆదివారం గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య రాత్రి బస కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ గురించి రోడ్డు భద్రత నియమావళి గురించి చదువు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు. గ్రామాల్లో ప్రజలు ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి సోదర భావంతో కలిసి ఉండాలని సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపించిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఎస్సై ప్రజలను కోరారు…
గూడూరులో వాహనాల తనిఖీ…గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య గూడూరు పట్టణంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రయాణ సమయాలలో కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని లేనిపక్షంలో వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించి పోలీసు వారికి సహకరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.