కిరణ్ 24×7 న్యూస్; కురువ కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా గూడూరు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన కురువ వెంకట రాముడు ఎన్నికయ్యారు. కురువ కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా కురువ వెంకట రాముడు ఎన్నిక కావడంతో ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపి ఆయనను ఘనంగా సన్మానించిన కురువ సంఘం నాయకులు, మరియు గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర డైరెక్టర్ గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు గాను ఎంతో రుణపడి ఉంటారని కురువ కురుబ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మద్దిలేటి, కర్ణం, చిన్న గిడ్డయ్య. నాగేష్. కృష్ణ. బ్రహ్మయ్య. గోపాల్. నాగ సుంకయ్య. తిప్పన. యుగంధర్. సుంకన్న. పాల్గొన్నారు..