కిరణ్ 24 x7 న్యూస్ ;భారత రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంఆర్పిఎస్ నాయకులు ఆంధ్రయ్య తెలిపారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1949సం నవంబరు 26వ తేదిన భారత రాజ్యాంగ పరిషత్ *రాజ్యాంగాన్ని* ఆమోదించింది. అయితే భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిందని అన్నారు.. రాజ్యాంగాన్ని దాదాపు రెండు సంవత్సరాల 11నెలల 18రోజులలో పూర్తి చేసి జాతికి అంకితం చేసిన ఘనత బాబా సాబ్ అంబేద్కర్ గారికి దక్కిందని అని అన్నారు.






