కిరణ్ 24×7 న్యూస్: కోడుమూరు నియోజకవర్గం, సి. బెలగల్ మండలం, పోలకల్ గ్రామానికి చెందిన శ్రీలత (8 వ తరగతి) చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీలత పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఆ బాలిక ఆమె తోటి విద్యార్థినిలతో కలిసి చదువుకొనుచుండగా అకస్మాత్తుగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మ విరిగి వారి మీద పడింది. ఈ సంఘటనలో విద్యార్థినిలకు గాయాల అవగా, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, స్వల్ప గాయాలైన విద్యార్థులు డిశ్చార్జ్ కాగా శ్రీలత అనే విద్యార్థిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డి. విష్ణు వర్దన్ రెడ్డి , కొడుమూరు నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి , కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష తో మాట్లాడి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారితో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు. సోమవారం బాధిత కుటుంబీకులను పరామర్శించి ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.






