కిరణ్ 24×7 న్యూస్ :
జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గూడూరు పశు వైద్యశాల నందు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని ఏడిఏ డాక్టర్ పి. శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ శివకుమార్ మాట్లాడుతూ పశు వైద్య కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆరు నెలలు వయసు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు వేయించాలని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువులలో పని చేసే సామర్థ్యం తగ్గుతుందని, అలాగే పాడి పశువులలో పాల ఉత్పత్తి తగ్గుతుందని అన్నారు. కావున రైతులు గాలుకుంటూ వ్యాధి సోకక మునుపే పశువులకు టీకాలు వేయించాలని అన్నారు.






