గూడూరు న్యూస్( కిరణ్)
గూడూరు మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన గూడూరు మండల తాసిల్దార్ వెంకటేష్ నాయక్ ను శుక్రవారం గూడూరు పట్టణంలోని టిడిపి నేతలు కలిసి ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు పట్టణ టిడిపి నాయకులు విష్ణు వర్గం నేత బుజుగు పౌలు ఆధ్వర్యంలో స్థానిక టిడిపి నాయకులు విష్ణు వర్గం నేతలు తాసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు మండల పరిధిలో నెలకొని ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భోజగు పౌలు, తెలుగు శీను,మాసపోగు చందు, చెంచుల విజయ్, డీలర్ సుందరాజు, డీలర్ ప్రభాకర్, కోళ్ల రంగన్న, బేక్కం దివాకర్, బేక్కం ఇమ్మా నెలు, దండు ప్రభాకర్, భోజగు జాన్, భోజగు మాధవరావు, భోజగు గౌండా యాకోబు,ఉత్త నూరు సుందరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.






