మాట తప్పిన నాయకులను నిలదీయండి…. కోడుమూరు ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్.
గూడూరు న్యూస్:
గూడూరు పట్టణం మరియు మండలంలో వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం..
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై దిశానిర్దేశం…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాట తప్పిన నాయకులు మీ వద్దకు వస్తే నిలదీయాలని వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నైజమని అన్నారు. గూడూరు పట్టణంలోని బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. మాజీ కుడా చైర్మన్ , కోడుమూరు నియోజవర్గ సమయం సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చానని ఆయన అన్నారు. మాజీ సీఎం వైయస్ జగన్ అర్హులందరికీ అన్నీ పథకాలు అందిస్తే…ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు. వైయస్ఆర్ , వైయస్ జగన్లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మఒడి, నాడు–నేడు, కార్పొరేట్ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. క్యూఆర్ కోడ్ను ప్రతి ఇంటికి చేర్చి చంద్రబాబు ఇచ్చిన హామీలు– చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మండల కన్వీనర్ రామాంజనేయులు, టౌన్ కన్వీనర్ ఆబేలు నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఉప అధ్యక్షులు ఎల్. వెంకటేశ్వర్లు, కౌన్సిలర్, కోడుమూరు నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షులు కుమార్ , కౌన్సిలర్లు దస్తగిరి, విజయుడు,గూడూరు మండల కన్వీనర్ రామాంజనేయులు, టౌన్ కన్వీనర్ ఆబెలు, అనుబంధాల విభాగల జిల్లా కార్యదర్శి నరసింహ రెడ్డి , కోడుమూరు మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి, వెంకటేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మునగల సర్పంచ్ గోపాలు, టౌన్ ఉపాధ్యక్షులు గంగాధర్,ఎంపీటీసీ ఏసేపు, మహేశ్వర్ రెడ్డి, మాధవస్వామి, రామచంద్రుడు,భాస్కర్ రెడ్డి, రఘురాంరెడ్డి, దౌలత్, సురేష్, నాగరాజు, అంజి, ప్రతాప్, రమేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






