ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం
కిరణ్ న్యూస్:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర పార్టీ కార్యాలయంలో గురువారం గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు పిఎసి కమిటీ సభ్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా. ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ మంత్రివర్యులు పిఎసి కమిటీ సభ్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా. ఆదిమూలపు సురేష్ మరియు కోడుమూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ గుర్రం జాషువా సేవలను కొనియాడారు. ఆయనను ఎంతగానో ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఇన్చార్జులు స్థానిక వైసిపి నేతలు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.