కూటమి మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దాం..
వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్.
సి. బెళగల్ మండలంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం..
‘బాబు షూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై దిశానిర్దేశం.
Gudur NeWS :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సుపరిపాలన అంటూ డ్రామాలు ఆడుతోందని వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
విమర్శించారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మోసాలను, అక్రమ కేసులు, భూ ఆక్రమణలను ఇంటింటికి వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కోడుమూరు నియోజకవర్గంలోని సి. బెళగల్ మండల వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం డాక్టర్ ఆదిమూలపు సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు సతీష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ గురువు మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని రాజకీయ వచ్చానని వారి వెంటనే ఉంటూ కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.
గతంలో జరిగిన విధంగా కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారికి న్యాయం జరిగే విధంగా నేను ముందుంటానని ఆయన అన్నారు. ఇప్పుడు పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి చేయాల్సిన అన్ని పనులు వారికి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రస్తుత ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పరిస్థితిలో లేదని, ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం కూడా పూర్తి చేయలేదన్నారు.
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు లేవని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను తాము చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, మాటలకు గ్యారెంటీ లేదని, చంద్రబాబు నాయుడు మోసగాడని అన్నారు. కూటమి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస రెడ్డి, పాండు రంగన్న, దస్తగిరి, లోకేష్, ఇమ్మనియేలు, మంత్రాలయం, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ గోవిందా రెడ్డి, వైస్ ఎంపీపీ రఘు, జిల్లా అనుబంధాల నాయకులు నాగేశ్వర రెడ్డి, ఎస్ ఎం భాష, తులసిరెడ్డి,నరసింహారెడ్డి, పులి రాజు, కోడుమూరు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు నరసింహులు, డాక్టర్ వింగ్ అధ్యక్షులు, కో ఆప్షన్ మెంబర్ హారోన్, వాలంటరీ విభాగం అధ్యక్షులు మల్లికార్జున, శంకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి,రామ చంద్రా రెడ్డి, రామాంజనేయులు, సి బెళగల్ మండలఎస్సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న, ఆర్ టి ఐ విభాగం అధ్యక్షులు నాగేష్, మహానంది , సురేష్, శేఖర్, శాంతి రాజు, సోషల్ మీడియా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






