గూడూరు పల్లె వాణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ముందుకు సాగుతున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం క్రింద సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చే మహా యజ్ఞం కొనసాగుతోంది.గూడూరు నగర పంచాయతీ – 1వ వార్డు (173వ బూత్)లో డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా డీసీసీబీ అధ్యక్షులు డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సూచనలతో, వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారుప్రజల సమస్యలు వినిపించి, స్థానిక అభివృద్ధి అవసరాలను నమోదు చేశారు.“సూపర్ సిక్స్” సంక్షేమ పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.వార్డులోని ప్రధాన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి,ఇషాక్,బాబురావు,ఎం కిరణ్,రాజు,బూత్ కన్వీనర్ బెన్నీ,ఆదాము, చిన్న, రాజశేఖర్ తదితరులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






