కోడుమూరు పల్లె వాణి:  చేనేత కార్మికులతో పాటు చేనేత రంగంలోని ఉపవృత్తులకూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం “నేతన్న భరోసా” పథకం ద్వారా సంవత్సరానికి రూ.36వేల ఆర్థిక సాయం అందించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.చేనేత సహకార సంఘాలు,సహకారేతర చేనేత రంగంలోని కార్మికుల ఉపాధికై..ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన కృష్ణాజిల్లా పెడన పట్టణంలో ప్రారంభమైన చేనేత అధ్యయన యాత్ర గురువారం కర్నూలు జిల్లా కోడుమూరుకు చేరుకుంది.చేనేత అధ్యయన యాత్రలో భాగంగా ముందుగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుగుడే మాధవస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ,సిపిఐ మండల కార్యదర్శి రాజు తదితరులతో కలిసి గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..అనంతరం పట్టణంలోని కొండపేట బీసీ కాలనీ కొత్తపేట తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులను కలుసుకొని వారి సమస్యలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు,మహిళా సంఘం నాయకురాలు సులోచనమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు