ముడుమలగుర్తి గ్రామంలో కోటి సంతకాల సేకరణ..

ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కొన‌సాగుతున్న ప్ర‌జా ఉద్య‌మం..

కిరణ్ 24×7 న్యూస్ :

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ చురుగ్గా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్‌సీపీ ఎస్ఈసీ స‌భ్యుడు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు గురువారం కోడుమూరు మండ‌లం ముడుములగుర్తి గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆధ్వ‌ర్యంలో ర‌చ్చ‌బండ‌- కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు.

ఈ సందర్భంగా ఆదిమూల‌పు స‌తీష్  మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్యవిద్య, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుఆటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలను మంజూరు చేస్తే, ఇపుడు వాటిని పిపిపి విధానంలో ప్రయివేటుకు కట్టబెట్టే కుట్రలను కూటమి ప్రభుత్వం చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 45 రోజులపాటు కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు.

బిజెపి పాలిత ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ కాలేజీలను ప్రయివేటుకు అప్పగించారా? అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో
మండల కన్వీనర్ రమేష్ నాయుడు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి , సోమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ టీచర్స్ విభాగం అధ్యక్షులు సురేందర్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, గొల్ల మనోహర్, కోట్ల దేవన్న, గొల్ల నడప మద్దిలేటి, పొలిదాస్ మద్దిలేటి , బోయ ఈశ్వరప్ప , కురువయ్యస్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు