*సీసీ రోడ్డు నిర్మాణం వెడల్పు 40 అడుగులకు పెంచాలి:సీపీఐ*
*ఆర్ అండ్ బి అధికారులను చుట్టుముట్టిన సీపీఐ,మండల ప్రజలు*
*సమాధానం చెప్పడానికి నీళ్లు నమిలిన అధికారులు*
కిరణ్ 24×7 న్యూస్:
సి.బెళగల్ మండల కేంద్రంలోని రోడ్డు నిర్మాణం వెడల్పు 40 అడుగులకు పెంచాలని కోరుతూ సీపీఐ బెళగల్ మండల సమితి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది.ఈ ఆందోళన కార్యక్రమానుద్దేశించి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రాజు, జిల్లా సమితి సభ్యుడు శ్రీరాములు గౌడ్ మాట్లాడుతూ ప్రధాన రహదారి లేక మండల ప్రజలు గత అనేక సంవత్సరాలనుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో అనేకసార్లు ఆందోళన నిర్వహించిన ఫలితంగా రోడ్డు నిర్మానానిక ప్రభుత్వం నిధులు విడుదల
చేసిందని, అందులో భాగంగానే రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని అయితే చేపడుతున్న రోడ్డు నిర్మాణం కేవలం 20 అడుగులు వెడల్పు మాత్రమే నిర్మాణం చేపడుతున్నారని దీనివలన సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా సమస్య పెరిగే అవకాశం ఉందని సీపీఐ నాయకులు ఆర్ అండ్ బి అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.20అడుగుల రోడ్డు నిర్మాణంతో చాలా చిన్నదిగా రోడ్డు తయారవుతుందని, అప్పుడు వ్యాపార వర్గాలు, ప్రజలు అనేక ప్రమాదాలకు ఆర్ అండ్ బి అధికారులు కారణమావుతారని ప్రశ్నించడంతో అధికారులు చేసేది ఏమిలేక వినతిపత్రం తీసుకోని అక్కడినుండి వెళ్లిపోయారు. అక్కడినుండి సీపీఐ నేతలు, గ్రామ ప్రజలు ఎంపిడిఓ కార్యాలయానికి చేరుకొని సమస్యను వివరించి వినతిపత్రం అందచేశారు.పదిరోజులలోపు సమస్యను
పరిష్కరించకపోతే మండల ప్రజలను కలుపుకొని పెద్దఎత్తున వరుస ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అవుతామని హెచ్చరిస్తున్నాము. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మల్లిఖార్జున, నాయకులు నల్లన్న, పక్కిరన్న, చిన్న నాగన్న, రాముడు, పెద్ద నాగన్న, గోవిందు, స్థానిక మండల ప్రజలు పాల్గొన్నారు.






