అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
( కిరణ్ 24×7 న్యూస్):
తెలుగుదేశం పార్టీ జాతీయ అయక్షులు నారాచంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కేడిసిసి ఛైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి సూచనల మేరకు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం ఆర్. కొంతలపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ 2025- 26 రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి , కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగింది అని అన్నారు.రైతులకు రెండో విడతగా రూ. 7 వేల సహాయాన్ని జమ చేయటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల కు ఏటా 20000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అందులో ఈ ఏడాది కింద రెండో విడతగా కేంద్ర వాటా 2000 రూపాయలు పి యం కిసాన్ పథకం ద్వారా మరియు రాష్ట్ర వాటా కింద 5000 రూపాయలు మొత్తం మీద 70000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు.

ఈ పథకం ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 46.85 ,837 మంది రైతులకు రెండవ విడతలో భాగంగా 3135 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు.సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ, రైతు కుటుంబాలకు నేరుగా లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్న్నారన్నారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు అర్హత బదిలీ (డెత్ మ్యుటేషన్) చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.రైతులు ఎన్ పి సి ఐ వినియోగంలో లేని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తెచ్చుకుంటే వెంటనే నిధులు జమ అయితాయని తెలియజేశారు.దాదాపు 6310 కోట్లు 2 విడతలుగా అందించడం జరిగిందన్నారు.రైతులకు పంటల ఉత్పత్తి ఖర్చులను సవరించి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడనుందన్నారు .

రైతుల కష్టానికి గౌరవంగా, ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా ఈ పథకం అమలు అవుతోందని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు , రైతు సంఘం నాయకులు , వివిధ సంఘాల డైరెక్టర్లు కర్నూలు ఎమ్మార్వో ఎంపీడీవో మండల ,అగ్రికల్చరల్ అధికార యంత్రాంగం , కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.