పీపీపీ విధానంతో పేదలకు వైద్య సేవలు భారం… కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్.
( కిరణ్ 24×7 న్యూస్):

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంతో పేదలకు వైద్య సేవలు భారం అవుతాయి. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు, గూడూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పి ఎన్ అస్లాం ఆధ్వర్యంలో కర్నూలు న‌గ‌రంలోని గౌరీ గోపాల్ ఆసుప‌త్రికి ఎదురుగా ఉన్న‌ ధర్నా చౌక్ దగ్గర చేప‌ట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిల‌తో క‌లిసి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొని మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను వివ‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. అన్ని జిల్లాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మించి విద్యార్థులు వైద్య విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలోకి తీసుకువచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని విమర్శించారు.

అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మణి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సురేంద్రారెడ్డి, కర్నూలు జడ్పీటీసీ ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపీ నెహెమియా, గూడూరు వైస్ చైర్మన్ లక్ష్మన్న, కౌన్సిలర్ మద్దిలేటి, కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్ రెడ్డి, వెంకాయ పల్లి ఎల్లమ్మ దేవాలయం మాజీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, గూడూరు మండల కన్వీనర్ రామాంజనేయులు, కర్నూలు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సంపత్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గూడూరు టౌన్ వైఎస్ఆర్సిపి పార్టీ ఉపాధ్యక్షులు హబీబ్, ప్రసాదు, శేఖర్, దామోదర్ నాయుడు, మధు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.