రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం

కిరణ్ 24×7 న్యూస్:

రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరో ముందడుగు

రైతన్న మీకోసం పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.

*కర్నూలు మండలం నిర్జూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి *
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఈరోజు

రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి  పాల్గొన్నారు. రైతన్న కోసం – మీ కోసం పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పంటలాభాలు పెంచే విధానాలు, ఆధునిక  పద్ధతులు, సబ్సిడీల వివరాలు, భవిష్యత్ వ్యవసాయ విధానాలు వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించారు.

రైతుల సమస్యలు, పంటల నష్టం, మార్కెట్ స్థితి, ప్రభుత్వం అందిస్తున్న సహాయాలు వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించబడింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి  వివరించారు.

అలాగే, రైతు బంధు, పంట బీమా, డీజిల్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ, ఎరువుల అందుబాటు వంటి అంశాలపై రైతులకు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ముందుకు తెచ్చి పరిష్కరించుకునేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

స్థానిక రైతులు, వ్యవసాయ మండల అధికారులు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.