*గూడూరు మీనోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి*
కిరణ్24×7 న్యూస్:
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బెస్త కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు,అధికారులు,గూడూరు, c.బెలగల్ మండల నాయకులు,పాల్గొని
గూడూరు మండలంలోని తిమ్మాపురం చెరువులో 15 లక్షల చేపలను నీటిలో వదిలారు.
అనంతరం
C.బెలగల్ వారికి నిర్వహణ ఖర్చులకి PMMSY పథకం కింద 2.54.000 రూ. ల చెక్కులను అందజేశారు.
చేపల సాగు, మార్కెటింగ్, నిల్వ, రవాణా సదుపాయాల అభివృద్ధికి FFPOలు కీలకంగా మారనున్నాయంటూ అధికారులు కార్యక్రమంలో వివరించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు, ప్రభుత్వ మద్దతు, సహకార సంఘాలకు లభించే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు..
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మత్స్యకారులకు రక్షణ కవచంలా కూటమి ప్రభుత్వ పథకాలు
“కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకుంటుంది. వర్షాధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ఆర్థికంగా గొప్ప రక్షణనిస్తున్నాయి”
అని అభిప్రాయపడ్డారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో —
చెరువుల పూడిక తీయడం
చేపల విత్తనాలు, ఫీడ్‌ల పంపిణీ
మత్స్య నౌకల రుణ సబ్సిడీలు
పరికరాల ఆధునికీకరణ
FFPOల ద్వారా నేరుగా మార్కెటింగ్ అవకాశాలు
ఇవన్నీ గ్రామీణ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడుతున్నాయని అధికారులు వివరించారు.
మత్స్యకార సంఘాల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది
గూడూరు ప్రాంత మత్స్యకార సంఘాలు తమ సమస్యలు, అవసరాలు వివరించగా, అధికారులు వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
చేపల సాగు ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సి.బెలగల్ మండలం గూడూరు మండలం కూటమి నాయకులు, ఆర్ ఖానాపురం గ్రామ సర్పంచ్, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్లు,రైతులు, ప్రజలు,మత్స్యకారులు పాల్గొన్నారు.







