చనుగొండ్ల గ్రామంలో రైతన్నా….మీ కోసం కార్యక్రమం.. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి.
కిరణ్ 24×7 న్యూస్:

ఇంటింటికి వెళ్ళి రైతులకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు,రైతులకు కలిగిన లబ్ది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి

ఈ సందర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ….

కూటమి ప్రభుత్వం 17 నెలల్లో సాధించిన అద్భుత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, రైతాంగాన్ని వ్యవసాయ నవశకంలోకి తీసుకువెళ్లడానికి ఈ పంచసూత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి.

“రైతన్నా.. మీ కోసం” కార్యక్రమం లో భాగంగా రైతును రాజు చేసే పంచసూత్రాలు!

వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి, లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం ఈ “రైతన్నా.. మీ కోసం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమం కేవలం పథకం కాదు, రైతు జీవితంలో విప్లవం తెస్తుంది,రైతులను సొంత కాళ్లపై నిలబెట్టి, గౌరవవంతమైన అన్నదాతలుగా తయారు చేస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి, పంచసూత్రాల గురించి, ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక లాభాల గురించి రైతు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిoచడం జరిగింది.మొన్న పందలపాకలో ప్రకృతి వ్యవసాయంతో కేవలం 500 రూపాయలు ఖర్చుతో సేంద్రియ ఎరువులతో దాదాపుగా 35 బస్తాలు దిగుబడి తీసుకురావడం జరిగింది.

పంచసూత్రాలు – శాశ్వత పరిష్కారం

1) నీటి భద్రత : నీటి కొరత వల్లే రైతు ఎక్కువగా కష్టపడతాడు.
అందుకే ప్రభుత్వం డ్రిప్, మైక్రో ఇరిగేషన్కు పెద్ద ప్రాధాన్యం ఇస్తోంది.బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది.’పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో శాస్త్రీయ సాగును క్షేత్రస్థాయిలో అందిస్తున్నారు.

2) డిమాండ్ ఆధారిత పంటలు: మారుతున్న ఆహారపు అలవాట్లకు (రసాలు,ఆకుకూరలు,కూరగాయలు, నాన్-వెజ్) అనుగుణంగా, మార్కెట్లో గిరాకీ (డిమాండ్) ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించడం.మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉందో, ఏ పంట వేసినా ఎక్కువ ధర వస్తుందో రైతుకు స్పష్టంగా తెలియచేయడం.రసాయనాలు తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని అవగాహన కల్పిచడం.ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ.. ఇదే చంద్రన్న లక్ష్యం.

3) అగ్రిటెక్ వినియోగం : డ్రోన్లు, యాంత్రీకరణ, భూసార పరీక్షలు వంటి ఆధునిక సాంకేతికతను రైతు చేతుల్లో పెట్టుతున్నారు.రైతు శ్రమ తగ్గి, పంట నాణ్యత పెరిగి, ఆదాయం రెట్టింపవుతోంది.

4) ఫుడ్ ప్రాసెసింగ్ : పంటకు విలువ జోడించే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతు లాభం ఎలా మారుతుందో ప్రభుత్వం వివరించనుంది. మామిడిని పల్ప్, మిర్చిని పొడిగా, పత్తిని దారంగా మార్చడం వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు రైతుకు స్థిరమైన ఆదాయం ఇస్తాయని అవగాహన కల్పించడం.పంట నష్టం తగ్గి, స్థిరమైన ఆదాయం పెరుగుతుంది.

5) ప్రభుత్వ మద్దతు : రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఆర్థిక భరోసా అందించడం.విటన్నింటినీ వ్యవసాయం చుట్టూ బలంగా స్థాపిస్తోంది కూటమి ప్రభుత్వం.

అన్నదాత సుఖీభవ + పీఎం కిసాన్ కలిపి ఇప్పటికే రూ.6,310 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది.రైతుకు కేవలం భరోసా ఇవ్వడం కాదు, అతడికి శాశ్వత సాధికారత కల్పించి, లాభసాటి వ్యవసాయానికి మార్గం చూపడమే ఈ పంచ సూత్రాల వెనుక ఉన్న దార్శనికత.

డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించి, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారుల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు.ఇది కేవలం పంటలకే కాదు, పాడి రైతులు, ఆక్వా, పౌల్ట్రీ, ఉద్యాన, సెరికల్చర్ రైతులందరికీ వర్తిస్తుంది.ప్రైవేట్ దుకాణాల కంటే రైతుసేవా కేంద్రాల్లో ఎరువుల ధర తక్కువగా ఉందనే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి రైతులకు వివరించనున్నారు.దాదాపుగా రూ.2,500/- ఉన్న యూరియా రూ.267/- కే సబ్సిడీ ద్వారా రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి దార్శనికతతో రైతన్న భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మొన్న మొoథా తుఫాను వలన పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడకుండా అధికారులను రైతు పక్షపాతిగా నష్టాన్ని అంచనా వేయాలని కోరడం జరిగింది.వారు ఆ విధంగానే నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపిచడం జరిగిందన్నారు..

ఈ కార్యక్రమంలో గూడూరు మండలం కన్వీనర్ సురేష్ ,మండల వ్యవసాయ శాఖ అధికారులు,సచివాలయ సిబ్బంది,కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు,ప్రజలు పాల్గొన్నారు.