రైతన్నా-మీకోసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే…
కిరణ్ 24 x7 న్యూస్:
కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం కళ్ళపరి గ్రామంలో నిర్వహించిన రైతన్నా-మీకోసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోడుమూరు శాసనసభ్యు బొగ్గుల దస్తగిరి …*మాట్లాడుతూ..
రైతులకు అన్నదాత సుఖీభవ పథకం గురించి, అలాగే గత 17 నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. పూర్తి స్థాయి సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేస్తున్నాము. సబ్సిడీతో గోకులం షెడ్లు కూడా నిర్మాణాలు చేపట్టాము. విత్తన సబ్సిడీ దగ్గర నుంచి పశువులకు అవసరమైన వ్యాక్సిన్ వరకు అన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటికే 14 వేల రూపాయలు రైతులు అకౌంట్లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వం పార్టీలు చూసి కులాలు చూసి పథకాలు అమలు చేసింది. రైతులందరూ ఒకే రకం పంటలు సాగు చేయవద్దు. పంట దిగుబడులు వచ్చే సమయానికి మార్కెట్లో ఏ పంటకు ధరలు ఉంటాయన్నది అధికారులు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం కొన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మేము ప్రతీ రైతు తరఫున ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి విద్యార్థుల పట్ల ముచ్చటగా తెలుగు వాక్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించమని సూచించారు.
పాఠశాల సమస్యలను ఉపాధ్యాయులతో కనుక్కున్నారు.
గ్రామంలోని సిసి రోడ్లు డ్రైనేజీ కాలువల గురించి పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు స్వయంగా సమస్యలను చూసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మండల టిడిపి నాయకులు కోడుమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్లు,సొసైటీ బ్యాంక్ చైర్మన్,డైరెక్టర్లు సచివాలయ సిబ్బంది,రైతులు, ప్రజలు పాల్గొన్నారు.







