గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఎస్పి..
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ను శనివారం కర్నూలు డి.ఎస్.పి జె.బాబు ప్రసాద్ తనిఖీ చేశారు.
వార్షిక తనిఖీ లో భాగంగా రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను బిల్డింగును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్య ఆత్మక గ్రామాలు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.

పాత పోలీస్ స్టేషన్ బిల్డింగు పరిసరాలను డి.ఎస్.పి పరిశీలించారు. కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జె. బాబు  ప్రసాద్. వెంట కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తబ్రేజ్ మరియు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి సిబ్బంది ఉన్నారు.