నకిలీ కాల్స్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.
కిరణ్ 24×7 న్యూస్:
ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్‌లో ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆదివారం తెలిపారు.
జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు పలు జాగ్రత్తలు చేశారు.
• వాస్తవికంగా బ్యాంకులు ఎప్పుడు కూడా ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ వంటి వివరాలు ఫోన్ లో అడగరని గుర్తుంచుకోవాలి.
• గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లిమిట్ పెంపు, కార్డ్ అప్ గ్రేడ్ అంటూ వచ్చే కాల్స్ కి స్పందించకండి.
• ఎలాంటి లింక్‌లు, అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు. అవి మోసపూరితమైనవి కావచ్చు.
• ఎవరికి వారి బ్యాంక్ డిటైల్స్, ఓటీపీ, సీవీవీ గురించి చెప్పకండి.
• అనుమానాస్పదమైన కాల్ వచ్చినట్లయితే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయండి లేదా మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కి సంప్రదించాలి.
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి
అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.
ఈ తరహా మోసాలను నివారించడానికి , అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ కట్ చేయండి మరియు అధికారిక మార్గాల్లో మాత్రమే బ్యాంక్ సేవలు ఉపయోగించుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






