రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలో కెడీసీసీ బ్యాంకు ఆవరణలో సోమవారం రైతు సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనకు దిగారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేడీసీసీ బ్యాంకు మేనేజర్ యూనిటీ మేడం మరియు గూడూరు సహకార సంఘం అధ్యక్షులు బి. దానమయ్య, సి.బెళగల్ సహకార సంఘం అధ్యక్షులు పోలకల్ అధ్యక్షులు ధనవంతు వీరి నిరసనకు మద్దతు నిస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు సహకార సంఘం అధ్యక్షులు దానమయ్య మాట్లాడుతూ జిల్లా చైర్మన్ మరియు నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించి సహకార సంఘం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు తెలిపి వారి న్యాయమైన డిమాండ్ల సాధనకై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.

కేడీసీసీ బ్యాంకు మేనేజర్ యూనిటీ మేడం మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం సహకార సంఘం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసనకు తాము మద్దతునిస్తున్నామని ప్రభుత్వం వారి డిమాండ్లను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గూడూరు మండల సహకార సంఘం సీఈవో శివకుమార్ రెడ్డి, సి.బెళగల్ సీఈవో ఎస్ ఖాజా హుస్సేన్, పోలకల్ సీఈఓ లక్ష్మన్న సిబ్బంది మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..

సహకార సంఘం ఉద్యోగుల డిమాండ్స్…రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు
* జి. ఓ నెం. 36 వెంటనే అమలుపరిచి, 2019 మరియు 2024 పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలి, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలి
* ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి.
* సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
* ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి, ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
* అనేక సంఘాలలో ఉద్యోగుల జీతభధ్యలను డ్యూటు పద్దు నందు ఉంచడం జరిగింది, ఈ డ్యూటు పద్దులను రద్దు చెయ్యాలి.
* 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి కూడా జి.ఓ నెం.36 అమలు పరచాలి.
* పి.ఏ.సి.ఎస్ ల ద్వారా కాకుండా, డి.సి.సి.బి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా ఋణాలు ఇస్తున్నారు. దీనివలన పి.ఏ.సి.ఎస్ నిర్వీర్యం అయిపోవీచున్నని. ఈ విధానాన్ని మార్పు చేసి అన్నీ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.
* సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి.
* సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదలీలు జరగాలంటే డి.ఎల్.ఎస్.ఎఫ్ ను అప్కాబ్, డిసీసీబీ లు, PACS లతో ఏర్పాటు చేసి 3 సువర్సరాల నిబందన కాకుండా నిరవదకంగా కొనసాగించి బదిలీలు చేయాలి.
* Capacity to pay నిభందనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను DLSF ద్వారా నిరవధికంగా చెల్లించాలి.
* ప్రస్తుతము పనిచేయుచున్న Assistant Executives Clerks లేదా కంప్యూటర్ ఆపరేటర్ లను సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పదవులను వీరితో భర్తీ చేసుకోవాలి.
* Assistant Executives DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి.






