వైసీపీ నుండి టిడిపి పార్టీలోకి చేరికలు…

కిరణ్ 24×7 న్యూస్:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో
కోడుమూరు నియోజకవర్గం సి బెళగల్ మండలం మారందొడ్డి గ్రామంలో నుంచి వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 250 మంది కార్యకర్తలు చేరారు.

కోడుమూరు నియోజకవర్గం లో నాయకులు డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీ లోకి చేరినట్లుగా మాజీ సర్పంచ్ రుక్మాందా మరియు 250 మంది కార్యకర్తలు నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుధాకర్ మరియు వార్డ్ మెంబర్ ఉప్పర సోమన్న, ఎల్లప్ప, ఏసోప్, పౌల్, s బడేసా, సుభాన్ రంగన్న, సుంకప్ప, సోమన్న మరియు మొదలగువారు పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రశేఖర్, పోలకల్ అమర్, తెలుగుదేశం నాయకులు జిక్రియ బాషా విక్రమార్కుడు ఆయుఫ్ బాషా,కాజావలి, సుభాన్, నజీర్, పాల్గొన్నారు.