డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కోడుమూరు ఎమ్మెల్యే
కిరణ్24×7 న్యూస్:

రాజ్యాంగ రూపశిల్పి,భారతరత్న, డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాక సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య యొక్క అవసరాన్ని ప్రతి భారతీయుడికి తెలియజేసిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేయడం ప్రతి ప్రజాప్రతినిధి, కార్యకర్త బాధ్యత అని తెలిపారు.
అంబేద్కర్ ఆలోచనలు నేటికీ సమాజాన్ని నిలబెట్టే బలమైన శక్తి అని, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను మరింత శక్తివంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమం, విద్యాభివృద్ధి, వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిడిపి నాయకులు,ప్రజాప్రతినిధులు,ఐటీడీపీ సభ్యులు,కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.