కోడుమూరు న్యూస్ (కిరణ్)
అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పత్తి పంటలను12,000 ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోడుమూరు భాస్కర్ రెడ్డి సర్కిల్ నందు సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి అధ్యక్షతన మద్దూర్ చిన్న రాముడు వహించగా ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అధిక తుఫానులు రావడం వలన పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోయినటువంటి రైతులకు 50 వేల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా పత్తి మొక్కజొన్న వరి ఆముదము సజ్జ వేరుశనగ వంటి పంటలను కొనుగోలు ప్రభుత్వము 12 వేల రూపాయలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు గొల్ల రాజు వెంకటగిరి ఎల్లప్ప రామ గిడ్డయ్య గొల్ల వీరప్ప కోడుమూరు రాజు తదితరులు పాల్గొన్నారు.






